Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష:

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నిరోధక చట్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష:

📰 Generate e-Paper Clip

* గ్రీన్ ఛానెల్ ద్వారా బాధితులకు తక్షణ పరిహారం
* ఇందిరమ్మ ఇళ్లలో ఎస్సీలకు 31%, ఎస్టీలకు 17% కేటాయింపులు
హైదరాబాద్ (ప్రజాసంక్షేమం న్యూస్):

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చట్టం సమర్థవంతమైన అమలు, కేసుల దర్యాప్తు, వేగవంతమైన విచారణ, బాధితులకు తక్షణ సహాయం, పునరావాసం మరియు ప్రత్యేక, మొబైల్ కోర్టుల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. దళితులు, ఆదివాసీలు, గిరిజనుల సర్వాంగీణ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారమే బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నామని, ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంలో ఎస్సీలకు 31 శాతం, ఎస్టీలకు 17 శాతం ఇళ్లను కేటాయిస్తున్నామని వెల్లడించారు.
అట్రాసిటీ బాధితులకు అందించే ఆర్థిక పరిహారాన్ని సాధారణ బడ్జెట్ నిధులతో ముడిపెట్టకుండా, ఎలాంటి జాప్యం లేకుండా గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా తక్షణమే విడుదల చేస్తున్నామని సీఎం తెలిపారు. అంతేకాకుండా, అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.