Monday, October 12, 2026
prajasamkshemam news
Homeప్రత్యేకంవినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు:ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్, యాదాద్రి జిల్లా

వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు:ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్, యాదాద్రి జిల్లా

📰 Generate e-Paper Clip

ప్రజలు,ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలి:ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్,IPS
ప్రజా సంక్షేమం న్యూస్ – యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్, IPS ప్రజలు, ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలకు పలు కీలక సూచనలు చేశారు.
🚨 4,000 విగ్రహాలకు నిమజ్జన ఏర్పాట్లు:
జిల్లా వ్యాప్తంగా సుమారు 4,000 వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించగా, ఇప్పటికే 750 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. బుధవారం మరో 2,000 నుంచి 3,000 విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉండటంతో పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహిస్తోంది.సబ్‌డివిజన్ల వారీగా భువనగిరిలో 800, యాదాద్రిలో 850, చౌటుప్పల్‌లో 1,350 విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.
👮 భారీ పోలీస్ బందోబస్తు:నిమజ్జనోత్సవాల సందర్భంగా 2 అదనపు ఎస్పీలు, 4 డీఎస్పీలు, 15 మంది ఇన్‌స్పెక్టర్లు, 30 మంది ఎస్సైలు, 500 మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించారు.సాయుధ బలగాలు, స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్, ఉమెన్ సేఫ్టీ, క్రైమ్ టీమ్స్‌తో పాటు ఫైర్, NDRF, మున్సిపల్, గ్రామపంచాయతీ, విద్యుత్ శాఖల సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు.
🌊 నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత:భువనగిరి చెరువు, బీబీనగర్, రాయగిరి, యాదగిరిగుట్ట నల్లచెరువు, వలిగొండ, రామన్నపేట తుమ్మలగూడెం, చౌటుప్పల్, మోత్కూర్, పోచంపల్లి తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, సీసీ కెమెరాలు, లైటింగ్, బారికేడింగ్ వంటి భద్రతా ఏర్పాట్లు చేశారు.
⚠️ ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు:
– ఊరేగింపులను కేటాయించిన మార్గాల్లోనే నిర్వహించాలి.
– బారికేడ్లు దాటి చెరువులు, నీటి ప్రాంతాల్లోకి వెళ్లకూడదు.
– మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
– మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు.
– వాహనాలపై పరిమితికి మించి ప్రయాణించకూడదు.
– వాహనాలపై ప్రమాదకరంగా నిలబడి ప్రయాణించరాదు.
– డీజేలు, సౌండ్ సిస్టమ్‌లకు సంబంధించిన సమయ పరిమితులు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
– సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దు.
– అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలి.వినాయక నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.