Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణగ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర!

గ్రామ అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర!

📰 Generate e-Paper Clip

వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యలపై ముందస్తు ప్రణాళికలు..
పారిశుద్ధ్యం, వీధిలైట్లు, చెత్త సేకరణపై ప్రత్యేక దృష్టి..
కార్యదర్శుల పనితీరును ప్రతి నెల సమీక్షిస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, సెప్టెంబర్ 28 (ప్రజా సంక్షేమం న్యూస్ – మునుగోడు ప్రతినిధి):

గ్రామాల సమగ్ర అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు కీలక బాధ్యత వహించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో 28 గ్రామపంచాయతీల కార్యదర్శులతో గ్రామాల అభివృద్ధి,స్థానిక సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం,తాగునీరు, వీధిలైట్లు,చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు తదితర అంశాలపై ఎమ్మెల్యే సమీక్షించారు.రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.పంచాయతీ కార్యదర్శులు తమ బాధ్యతలను గుర్తించి సమర్థవంతంగా పనిచేయాలని,గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యదర్శుల పనితీరును ప్రతి నెల సమీక్షిస్తామని స్పష్టం చేశారు.ఎల్‌వీ నో ప్రభావంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ముందుచూపుతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో తహసీల్దార్ నేలపట్ల నరేష్,మండల అభివృద్ధి అధికారి పారుపాటి వెంకటేశ్వర రెడ్డి,ఎంపీవో కేదార్నాథ్,సూపరింటెండెంట్ విజయ భాస్కర్,అన్ని గ్రామపంచాయతీల కార్యదర్శులు,కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.