Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసిరిసిల్ల అభివృద్ధికి రూ.340 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

సిరిసిల్ల అభివృద్ధికి రూ.340 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

📰 Generate e-Paper Clip

నేతన్న బజార్‌తో పాటు విద్య, ఆలయ అభివృద్ధి, పోలీస్–పరిపాలనా భవనాలకు శంకుస్థాపన
ప్రజాసంక్షేమం న్యూస్ సిరిసిల్ల, సెప్టెంబర్ 30:
సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సుమారు రూ.340 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సిరిసిల్ల ప్రజలు ఎంతోకాలంగా కోరుకుంటున్న నేతన్న బజార్తో పాటు విద్య, దేవాలయ అభివృద్ధి, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు.
రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు:సిరిసిల్ల, వేములవాడలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే సిరిసిల్ల, కోనరావుపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి కూడా పనులు ప్రారంభించారు.
వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.99.40 కోట్లు:
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.99.40 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి ఈ పనులు దోహదపడనున్నాయి.
రెవెన్యూ,పోలీస్ శాఖలకు కొత్త భవనాలు:సిరిసిల్ల, వేములవాడలో రెండు ఆర్డీవో కార్యాలయాలు, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్, రుద్రంగిలో నాలుగు తహసీల్దార్ కార్యాలయాలు, వేములవాడలో సబ్‌-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం నిర్మించనున్నారు.రుద్రంగిలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములు, అనుబంధ యూనిట్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది.వేములవాడలో మహిళా పోలీస్ స్టేషన్, వేములవాడ, సిరిసిల్లలో రెండు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి పనులు ప్రారంభించారు.
ఇందిరా మహిళా శక్తి భవన్ ప్రారంభం:సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, స్వయం ఉపాధి, సాధికారతకు ఈ భవన్ వేదికగా ఉపయోగపడనుంది.సిరిసిల్ల జిల్లాలో విద్య, ఆలయాలు, వ్యవసాయ మౌలిక వసతులు, పరిపాలన, పోలీస్ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.