Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి

📰 Generate e-Paper Clip

ఓటర్ల సవరణ పేరుతో లక్షలాది ఓట్ల తొలగింపు ఆపాలి: సీపీఎం

అన్ని రాజకీయ పార్టీలు ఆందోళనలకు సిద్ధం కావాలి: వేముల బిక్షం

ఆత్మకూరు, అక్టోబర్ 4: ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం ఆత్మకూరు మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు.ఆదివారం ఆత్మకూరు మండల పరిధిలోని కూరెళ్లలో నిర్వహించిన సీపీఎం గ్రామ శాఖ సమావేశానికి తుమ్మలగూడెం యాదయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వేముల బిక్షం మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ (SIR) పేరుతో చేపడుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా సాగుతోందని ఆరోపించారు.దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు, పేదల ఓట్లను తొలగించే విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని ఆయన విమర్శించారు. బీహార్, బెంగాల్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలోనూ లక్షలాది మంది ఓటర్లను తొలగించే చర్యలు జరుగుతున్నాయని, దీనిని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.జ్ఞానేశ్ కుమార్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీ దేశాన్ని హిందూ దేశంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని వేముల బిక్షం ఆరోపించారు. సీఈసీ వెంటనే రాజీనామా చేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా తీవ్రస్థాయి ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఎం గ్రామ కార్యదర్శి తుమ్మలగూడెం యాదయ్య, ఉప సర్పంచ్ హనుమంతుల రమేష్, మర్రిపెళ్లి మల్లయ్య, అంబోజు వెంకటయ్య, మేకల పాండు, పొన్నం అండాలు, జినకల భిక్షం, పొన్నం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.