ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రంగస్థల కళాకారుడు నానా పటేకర్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.హిందీ, మరాఠీ చిత్రాల్లో నానా పటేకర్ తన విలక్షణమైన నటన, శక్తివంతమైన సంభాషణా శైలి, సహజమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, రంగస్థల కళాకారుడిగా కూడా భారతీయ కళారంగానికి ఆయన విశిష్ట సేవలందించారని గుర్తుచేశారు.నానా పటేకర్ మృతితో భారతీయ సినీ ప్రపంచం ఒక విలక్షణమైన ప్రతిభను కోల్పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.నానా పటేకర్ 75 ఏళ్ల వయసులో గోవాలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో హిందీ, మరాఠీ సినిమాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు.
నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
0
13
Previous article
Next article
- Advertisment -

