ఉరుమడ్ల, అక్టోబర్ 8 (ప్రజా సంక్షేమం న్యూస్):
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందిస్తూ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సేవా భావాన్ని చాటుకున్నారు.ఇటీవల ఉరుమడ్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాము, జనపాల లింగస్వామి మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించిన అమిత్ రెడ్డి.. ఇరు కుటుంబాలకు చెరో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు.అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మేకల శ్రీహరి కుమార్తె, రాసమళ్ల సత్యనారాయణ (బీరయ్య) కుమార్తెకు చెరో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేల సహాయం అందించారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు పెద్ద కొడుకులా, విద్యార్థులకు అన్నలా అండగా నిలుస్తున్న అమిత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉపసర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పట్ల జనార్దన్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా అమిత్ అన్న…
RELATED ARTICLES

