Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరత్తిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

రత్తిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

మునుగోడు, అక్టోబర్ 9, ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి:
మునుగోడు మండలంలోని రత్తిపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని విద్యార్థినీ, విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి, ఉపాధ్యాయురాలు ఆయేషా ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ వేడుకలతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.