Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణభూ వివాద రహిత తెలంగాణే ప్రజాప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

భూ వివాద రహిత తెలంగాణే ప్రజాప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

📰 Generate e-Paper Clip

ఏడాదిన్నరలో సమగ్ర భూ రీ–సర్వే పూర్తి చేయడమే లక్ష్యం
హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రజా సంక్షేమం న్యూస్):
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి, భూ వివాద రహిత తెలంగాణను నిర్మించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. సుమారు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ రీ–సర్వేకు శ్రీకారం చుట్టామని, ఏడాదిన్నరలో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భూ రీ–సర్వే పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సర్వేను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏడు జోన్లకు రెవెన్యూ, సర్వే విభాగాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 14 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు. సర్వేలో వేగం, నాణ్యతతో పాటు ప్రతి దశలో పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
రియల్‌టైమ్‌లో పర్యవేక్షణ:భూ రీ–సర్వే పురోగతిని రాష్ట్రస్థాయి నుంచి పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పురోగతి, గ్రామాల వారీగా పూర్తయిన పనులు, సర్వే బృందాల వివరాలు, రోవర్ల వినియోగం, వాటి లొకేషన్ తదితర సమాచారాన్ని రియల్‌టైమ్‌లో తెలుసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు.
2,768 గ్రామాల్లో సర్వే:తొలి దశలో నక్షాలు లేని 365 గ్రామాలతో పాటు జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో కలిపి మొత్తం 2,768 గ్రామాల్లో భూ రీ–సర్వే చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు 245 గ్రామాల్లో సర్వే పూర్తయిందని తెలిపారు. ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, తాను ప్రతి 15 రోజులకు ఒకసారి స్వయంగా సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని పేర్కొన్నారు.
అసైన్డ్ భూములపై చర్యలు:భూ రీ–సర్వే పేరుతో ప్రజల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో 385 ఎకరాలకు సంబంధించి 45 ఎకరాల భూమి తక్కువగా ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అక్కడ చేతులు మారిన అసైన్డ్ భూములను గుర్తించి చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అసైన్డ్ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేసే అంశంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.