Wednesday, October 14, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకళాకారుల రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలి

కళాకారుల రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలి

📰 Generate e-Paper Clip

అర్హులైన కళాకారులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలి
మునుగోడు, అక్టోబర్ 14, ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి:

నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట అక్టోబర్ 15న గురువారం నిర్వహించనున్న కళాకారుల రిలే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు పందిరి సైదన్న పిలుపునిచ్చారు.మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న గద్దర్ అధ్యక్షతన నిర్వహించిన నిరుద్యోగ ఉద్యమ కళాకారుల అత్యవసర సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కళాకారులు గ్రామగ్రామాన ధూంధాం కార్యక్రమాలు నిర్వహించి, పాటలు, ఆటల ద్వారా ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపారని గుర్తుచేశారు.గత ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో 500 ఉద్యోగాలు కల్పించిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో అర్హులైన కళాకారులకు వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడం లేదని విమర్శించారు. ఉద్యోగాల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కళాకారులను వివిధ పోలీస్ స్టేషన్లలో అరెస్టు చేయడం బాధాకరమన్నారు.
కళాకారుల ప్రధాన డిమాండ్లు:
– అర్హులైన కళాకారులకు వెంటనే ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభించాలి.
– వృద్ధ కళాకారులకు నెలకు రూ.12 వేల పింఛన్ అందించాలి.
– కళాకారులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
– ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి.
– సంక్షేమ పథకాల్లో కళాకారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
అక్టోబర్ 15న నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఒకరోజు రిలే నిరాహార దీక్షకు తెలంగాణ ఉద్యమ కళాకారుల వ్యవస్థాపక అధ్యక్షుడు అనువోజు వెంకటేశం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ కుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు. జిల్లా కళాకారులందరూ సకాలంలో చేరుకుని దీక్షను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రడం నర్సింగ్ రావు, కార్యదర్శి రాములు, కోశాధికారి మేడి సైదులు, శంకర్, మారయ్య, బిక్షమయ్య తదితర కళాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.