Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన కాంగ్రెస్ నాయకులు
ఉరుమడ్ల, అక్టోబర్ 23:
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు బుద్ధుడు పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును పొందేందుకు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమని, పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా, తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సైదులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, పాకాల దినేష్, మేడబోయిన స్వాతి శ్రీను, ఉయ్యాల మల్లేష్, గంగాపురం వెంకటేష్, ఎం.డి. జాంగిర్, ఎం.డి. కాజా, బెలిజ అరుణ్ కుమార్, కొండ శ్రీను, రూపాని రవి, బెలిజ మహేష్, గుంటోజు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.