Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

**వట్టిమర్తిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం**
ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల:

రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసి, వారికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కేంద్రానికి వచ్చే రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మండల తహసీల్దార్, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్రా వినోద్ మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు, వట్టిమర్తి గ్రామ సర్పంచ్, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.