Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుప్రజాపాలనపై మంత్రుల ఫోకస్‌.. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉన్నతస్థాయి సమీక్ష

ప్రజాపాలనపై మంత్రుల ఫోకస్‌.. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఉన్నతస్థాయి సమీక్ష

📰 Generate e-Paper Clip

ప్రజాపాలనలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం!
ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉన్నత స్థాయి సమీక్ష:
ప్రజాసంక్షేమం న్యూస్ సంగారెడ్డి:

ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందించడం, జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.ప్రజాపాలన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాల్సిన అవసరంపై సమీక్ష సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజీవరెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్ హాజరయ్యారు.మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించేందుకు ఈ సమావేశం నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.