పట్టభద్రుల ఓటరు నమోదుకు నవంబర్ 6 చివరి గడువు!
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పట్టభద్రుల ఓటరు నమోదు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆయన సమీక్షించారు.నిబంధనల ప్రకారం అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6వ తేదీలోగా ఫారం-18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మూడేళ్ల క్రితం లేదా అంతకుముందు డిగ్రీ ఉత్తీర్ణులైన స్థానిక పట్టభద్రులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
అర్హులైన ప్రతి పట్టభద్రుడు నమోదు చేసుకోవాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్
RELATED ARTICLES

