Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుశతవసంతాల విద్యా ప్రదాత చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

శతవసంతాల విద్యా ప్రదాత చుక్కా రామయ్యకు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్): ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ సమాజానికి విశేష సేవలందించిన చుక్కా రామయ్య 100 సంవత్సరాల జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఎంతో ప్రత్యేకమైన పర్వదినమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన చుక్కా రామయ్య, విద్యారంగంలో తనదైన చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. విద్యార్థుల్లో ఐఐటీ విద్యపై ఆసక్తి పెంపొందించి, ఐఐటీ అనే పదాన్ని ప్రజలకు విస్తృతంగా పరిచయం చేసిన గొప్ప విద్యావేత్తగా ఆయన సేవలను గుర్తుచేశారు. విద్యావేత్తగా మాత్రమే కాకుండా శాసనమండలి సభ్యుడిగా కూడా ప్రజా సమస్యలపై తనదైన గొంతుక వినిపించారని అన్నారు.చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశం రావడం తనకు ఎంతో గర్వకారణమని, అదృష్టంగా భావిస్తానని సీఎం తెలిపారు. శాసనమండలిలో సామాజిక, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా ప్రశ్నించడమే కాకుండా, వాటి పరిష్కారానికి నిర్మాణాత్మక సూచనలు చేసేవారని గుర్తుచేశారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాలలు లేని విషయాన్ని చుక్కా రామయ్య శాసనమండలిలో ప్రస్తావించే వరకు ఆ సమస్యపై పెద్దగా దృష్టి పడలేదని, ఆయన ప్రస్తావనతో ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకుందని సీఎం పేర్కొన్నారుచుక్కా రామయ్య వంటి మహనీయులు కాలానికి, రాజకీయాలకు అతీతమైన వ్యక్తులని, వారి సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని అన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు మార్గదర్శకంగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చుక్కా రామయ్య ఆలోచనలు, సలహాలు, సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి తదితర ప్రముఖులు చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.సమాజానికి విద్యతో వెలుగునిచ్చిన మహనీయుడికి శతజన్మదిన వందనం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.