Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి

📰 Generate e-Paper Clip

నవంబర్ 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలి: చిరుమర్తి లింగయ్య
ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిన నవంబర్ 29వ తేదీని ప్రతి సంవత్సరం దీక్షా దివస్‌గా నిర్వహిస్తున్నామని తెలిపారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ కేసీఆర్ పోరాటాన్ని ప్రజలకు గుర్తుచేసేలా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఎదుర్కొన్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగిందని తెలిపారు. ఉద్యమానికి రాజకీయ దిశానిర్దేశం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు.
కేసీఆర్ దీక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటం
కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక వ్యక్తి పోరాటం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటమని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం చేసిన పోరాటం దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంపై దృష్టి సారించేలా చేసిందన్నారు. ఆ దీక్షతో ఉద్యమం మహా ప్రజా ఉద్యమంగా మారి విద్యార్థులు, యువత, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు, ప్రజాసంఘాలు ఏకమై ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడాయని తెలిపారు.అనేక అవమానాలు, అడ్డంకులు, కుట్రలను ఎదుర్కొన్నప్పటికీ తెలంగాణ ప్రజల పోరాట పటిమతో చివరకు 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు:తెలంగాణ రాష్ట్ర సాధనతో కేసీఆర్ బాధ్యత ముగియలేదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టేందుకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ప్రజలకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అమరవీరుల త్యాగాలను విస్మరించవద్దు:దీక్షా దివస్ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాలు, ఉద్యమ చరిత్రను విస్మరించవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని, వారి ఆశయాల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.నవంబర్ 29న ప్రతి ఒక్కరూ దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగస్వాములై తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రజల హక్కుల కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరింత బలంగా పోరాటం చేస్తుందని చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.