ప్రజాసంక్షేమం న్యూస్ బోగారం:తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కునూరు లక్ష్మణ్ కుమార్ తండ్రి, బోగారం గ్రామ మాజీ సర్పంచ్ కునూరు గోపాల్ మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.జస్టిస్ కునూరు లక్ష్మణ్ కుమార్ నివాసానికి వెళ్లిన చెరుపల్లి సీతారాములు, కునూరు గోపాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామానికి రెండు పర్యాయాలు ప్రజాప్రతినిధిగా సేవలందించిన కునూరు గోపాల్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ పరామర్శ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్, రాష్ట్ర కార్యదర్శి ముషం నరహరి, కోడి పాండు, కునూరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ కునూరు గోపాల్‌కు చెరుపల్లి సీతారాములు నివాళి
0
15
Previous article
- Advertisment -

