జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటల వైపు వెళ్లాలని పిలుపు..!
దోమలపల్లి రైతు వేదికలో నిర్వహించిన “రైతు నేస్తం–100వ ఎపిసోడ్” కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు…
సెప్టెంబర్‌లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు వచ్చే అవకాశం లేదని, రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు…
కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాభావం కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశాలు తగ్గాయని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు…
నాగార్జునసాగర్, ఏఎంఆర్పీ ప్రాజెక్టులకు కూడా తగినంత నీరు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు…
ఇప్పటికే పత్తి, కంది సాగు చేసిన రైతులు అంతర పంటలు వేసుకోవడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవాలని కలెక్టర్ సూచించారు…
సజ్జలు, సామలు, కొర్రలు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని, వాటికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ వెల్లడించారు…
ఉద్యాన పంటలు, కూరగాయల సాగుతో పాటు ప్రభుత్వం సబ్సిడీపై బిందు సేద్య పరికరాలు అందిస్తోందని బి. చంద్రశేఖర్ తెలిపారు…
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…
రైతు నేస్తం కార్యక్రమం ద్వారా వాతావరణం, సాగు పద్ధతులు, ఎరువులు, నూతన వ్యవసాయ సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు…
ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యాన పంటలు, ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు…
సజ్జలు, సామలు, కొర్రలు నెలరోజుల వరకు నీరు లేకున్నా పెరిగే పంటలని, వాటిని అంతర పంటలుగా సాగు చేయవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు…
ఆయిల్ పామ్ సాగుతో స్థిరమైన ఆదాయం లభిస్తుందని, పురుగుల బెడద, కోతుల ఇబ్బందులు కూడా తక్కువగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు…
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, జిల్లా హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, హార్టికల్చర్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

