Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణతెలంగాణ సర్కార్ బడి విద్యార్థులకు కొత్త యూనిఫామ్

తెలంగాణ సర్కార్ బడి విద్యార్థులకు కొత్త యూనిఫామ్

📰 Generate e-Paper Clip

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం సరికొత్త థ్రిల్‌ను ఇవ్వబోతోంది. ఎందుకంటే, ఎప్పటి నుంచో ఉన్న పాత రెడ్ యాష్ కలర్ డ్రెస్సులకు ప్రభుత్వం గుడ్-బై చెప్పేసింది. వాటి స్థానంలో ట్రెండీ గా ఉండే సరికొత్త రంగులను, అదిరి పోయే కిట్లను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రభుత్వ స్కూల్ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్స్ తరహాలోనే ఫుల్ జోష్‌తో క్లాస్ రూమ్‌ లోకి అడుగుపెట్టను న్నారు. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల సరికొత్త యూనిఫాంలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది.

ఈసారి రెండు కేటగిరీలుగా డిజైన్లను మార్చారు. సాధారణ పాఠశాలల అబ్బాయిల షర్టులు, అమ్మాయిల టాప్స్ అన్నీ క్లాసీగా ఉండే లైట్ బ్లూ రంగులోకి మారాయి. అలాగే అబ్బాయిల ప్యాంట్లు, అమ్మాయిల బాటమ్స్ ముదురు నీలం రంగులో ఉంటాయి. ఇక గురుకుల పాఠశాల విద్యార్థులకు మెరూన్ చెక్స్ టాప్, దానికి మ్యాచ్ అయ్యేలా ప్లెయిన్ మెరూన్ లోవర్స్‌ను కేటాయించారు.

అలాగే, ఇకపై 6, 7 తరగతులు చదివే అబ్బాయిలకు కూడా ప్యాంట్లు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కీలక ఆదేశాలు ఇచ్చింది. దుస్తులు ఎక్కువ కాలం మన్నేలా ప్రముఖ ‘మఫత్‌లాల్’ సంస్థ నుండి 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ చేనేత సంస్థ నుంచి 55.32 లక్షల మీటర్ల నాణ్యమైన వస్త్రాన్ని సేకరించారు. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలల చరిత్ర లోనే తొలిసారి గా విద్యార్థులకు యూనిఫాంతో పాటు బూట్లు, సాక్సులు, బెల్టులను కూడా ఇస్తున్నారు. ఇక గురుకుల విద్యార్థు లకైతే బ్యాగు, టై, బెడ్డింగ్, ప్లేటు, గ్లాసులతో కూడిన గ్రాండ్ కిట్ అందిస్తు న్నారు. ఇవే కాకుండా, చరిత్రలో ముందె న్నడూ లేని విధంగా 2 లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగు, బెల్టు, టై, బూట్లు, సాక్సులను పంపిణీ చేస్తుండటం విశేషం. ఈ యూనిఫాంల కుట్టు పనిని పూర్తిగా మహిళా స్వయం సహాయక సంఘాల కు అప్పగించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.