జగన్నాథుడి రథయాత్ర నేడు ప్రారంభం అవుతుంది. ఆలయంలో ఉండే జగన్నాథుడు సోదరుడైన బలభద్రుడు సోదరి అయిన సుభద్రాదేవి తో కలిసి జనం మధ్య ఊరేగుతాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్లపక్ష విదియనాడు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది.
జగన్నాథుడు కొలువుదీరే రథం…
జగన్నాథుడు కొలువుదీరే రథం పేరు నందిఘోష, బలభద్రుడు కొలువు తీరే రథం పేరు తాళ ధ్వజ, సుభద్రాదేవి కొలువు తీరే రథం పేరు దర్ప దళనగా చెబుతారు. సుమారు 45 అడుగుల ఎత్తు ఉండే ఈ రథాలను వేప, సాల్, ధౌరా, సింబల్ వంటి ప్రత్యేకమైన కలపతో ప్రతి సంవత్సరం కొత్తగా తయారు చేస్తారు.
గుండిచా మందిరం…
స్వామివారు గుండిచా మందిరం లో 9 రోజులపాటు బస చేసి అనారోగ్యం తర్వాత తిరిగి కోలుకుని 9వ రోజున తిరిగి వచ్చే యాత్రను బహుడా యాత్ర అంటారు. ఇక పూరి జగన్నాధుని రథోత్సవానికి ముందు పూరి గజపతి మహారాజు చేరా పహేరా అనే పవిత్ర ఆచారాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బంగారు చీపురుతో రథాన్ని శుభ్రం చేసి రాజైన సామాన్యుడైన భగవంతుడు ముందు ఒకటేనన్న సంకేతాన్ని తెలియజేస్తారు.
జగన్నాథుడి రథయాత్ర…
పూరి జగన్నాధుని రథయాత్రలో అందరూ భక్తులు కలిసి రథాన్ని లాగడంతో పేద, ధనిక, కుల, మత తారతమ్యం లేకుండా భగవంతుడు ముందు అందరూ ఒకటే అనే అర్థం . అంతేకాదు సహజంగా భక్తులు భగవంతుని వద్దకు వెళతారు.. కానీ భగవంతుడే భక్తుల వద్దకు వచ్చే పూరి జగన్నాథుడి రథయాత్ర
భక్తుల కలల యాత్ర జగన్నాథుడి రథయాత్ర…
RELATED ARTICLES

