ఎట్టకేలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసారు. కొద్ది రోజులుగా నీట్ పరిణామాల నేపథ్యం లో కాక్రోచ్ పార్టీ- విద్యార్ధులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆందోళనలతో ఢిల్లీ హోరెత్తింది. సీజేపీతో ప్రభుత్వం రెండో విడత చర్చల వేళ వారి ప్రధాన డిమాండ్ మేరకు ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని ప్రధాని మోదీ ఆదేశించినట్లు సమాచారం. కాసేపట్లో జరిగే చర్చల్లో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఎట్టకేలకు అంగీకరించారు. దీంతో.. ఢిల్లీ వేదికగా సాగుతున్న నిరసనలకు ముగింపు లభించే అవకాశం కనిపిస్తోంది.
కేంద్రం విద్యార్ధులు.. కాక్రోచ్ పార్టీ నిరసనలకు దిగి వచ్చింది. వారి ఆందోళన విరమింప చేసేలా అనేక చర్యలు తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా కీలక నిర్ణయాలను వెల్లడించారు. అయితే, సీజేపీతో జరిగిన చర్చల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ పైనే విద్యార్థి సంఘాల నేతలు పట్టుబట్టారు. దీంతో.. ఈ వ్యవహారానికి ముగింపు ఇచ్చేందుకు ప్రభుత్వం తప్పని స్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని నిర్ణయించింది.నీట్ పరీక్ష పత్రాల లీక్.. తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఒక్క సారిగా కలకలం మొదలైంది. పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వం నిరసనకారులతో చర్చలకు సిద్దమైంది. దేశ వ్యాప్తంగా విద్యార్ధులకు ఇదే డిమాండ్ పైన మద్దతు లభించింది. దీంతో.. ప్రభుత్వం ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాకుండా.. వారిని శాంతింపచేసేందు కు పలు చర్యలు చేపట్టింది. ఎన్టీఏలో పూర్తి ప్రక్షాళన చేసింది. పరీక్ష పత్రాలు లీక్ అయితే అందుకు బాధ్యుల పైన కఠిన చర్యలకు వీలుగా కేబినెట్ కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..
RELATED ARTICLES

