Sunday, August 23, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఆషాఢ మాస బోనాలు: నేడు ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాల సమర్పణ

ఆషాఢ మాస బోనాలు: నేడు ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాల సమర్పణ

📰 Generate e-Paper Clip


హైదరాబాద్, సికింద్రాబాద్ వ్యాప్తంగా అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పట్టువస్త్రాలు సమర్పించనున్న శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు & ప్రజాప్రతినిధులు

​హైదరాబాద్ (ప్రజా సంక్షేమం):
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 9 ఆదివారం నాడు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
​ప్రముఖ ఆలయాల్లో పట్టువస్త్రాలు సమర్పించే ప్రజాప్రతినిధుల వివరాలు:
1. ఉప్పుగూడ శ్రీ మహంకాళి ఆలయం – శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్
2. మీరాలం మండి శ్రీ మహంకాళి ఆలయం – శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ స్పీకర్
3. లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం – మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్,శ్రీ కొండా సురేఖ
4. కార్వాన్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం – శ్రీ దామోదర రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
5. సుల్తాన్‌షాహి శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
6. హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న ఆలయం – శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి
7. చిలకలగూడ శ్రీ కట్ట మైసమ్మ ఆలయం – శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి
8. అంబర్‌పేట శ్రీ మహంకాళి ఆలయం – శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, మంత్రి
9. సబ్జీ మండి శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి
10. రాంబక్షబండ శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – శ్రీ జూపల్లి కృష్ణారావు, మంత్రి
11. భేలా శ్రీ ముత్యాలమ్మ ఆలయం – శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి
12. సుల్తాన్‌షాహి శ్రీ జగదాంబ ఆలయం – శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి
13. గౌలిపూర శ్రీ మహంకాళి ఆలయం – శ్రీ వాకిటి శ్రీహరి, మంత్రి
14. హరిబౌలి శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – శ్రీ వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు
15. హరిబౌలి శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – శ్రీ వి. హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు
16. బోయిగూడ శ్రీ బంగారు మైసమ్మ ఆలయం – శ్రీ కె. కేశవరావు, శ్రీ అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రతినిధులు
17. నాచారం శ్రీ మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయం – శ్రీ పి. సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు
18. గౌలిగూడ శ్రీ మహంకాళి ఆలయం – శ్రీ హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు
19. ఎల్‌బీనగర్ శ్రీ ఖిల్లా మైసమ్మ ఆలయం – శ్రీ పొచారం శ్రీనివాస్ రెడ్డి, శ్రీ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌లు
20. అలీజాకోట శ్రీ మహంకాళి ఆలయం – శ్రీ విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు/ఎమ్మెల్యే
21. మూసీ బ్రిడ్జి శ్రీ భూలక్ష్మి ఆలయం – శ్రీ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్
22. నట్రాజ్ నగర్ శ్రీ మహంకాళి ఆలయం – శ్రీ బాల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్
23. అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయం – శ్రీ జాతోత్ రామ్‌చందర్ నాయక్, ఉప సభాపతి
24. మురాద్ మహల్ శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – డా. బండా ప్రకాశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్
25. సీబీఐ క్వార్టర్స్ శ్రీ నల్ల పోచమ్మ ఆలయం – శ్రీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు
26. చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం – శ్రీ బి. మహేష్ కుమార్ గౌడ్, శాసనమండలి సభ్యుడు
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, భక్తుల నమ్మకాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రతినిధులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.