Sunday, August 23, 2026
prajasamkshemam news
Homeతెలంగాణకొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి కీలక అప్డేట్

కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి కీలక అప్డేట్

📰 Generate e-Paper Clip

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు అర్హుల జాబితాను ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో 119 నియోజక వర్గాల్లో ఈ కార్డుల పంపిణీ చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ ఈ కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి.
కొత్త రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా సంగారెడ్డి లో ప్రారంభం అవుతుందని వెల్లడించారు. అదే రోజున 119 నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతందని వివరించారు. పేద కుటుంబాల ఆహార భద్రతకు తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమంగా పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు రేషన్ కార్డుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) సమన్వయంతో జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ అధికారిక కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. లబ్ధిదారుల జాబితాల ఖరారు నుంచి కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలు, మీడియా ప్రచారం, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వరకు అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.