Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeక్రీడలుఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి.ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి.ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip


ప్రజా సంక్షేమం న్యూస్-తెలంగాణ
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరి గారితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.హైదరాబాద్‌లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు.తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌తో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో, క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు.ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ శివసేనా రెడ్డి గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గారు, SATG ఎండీ ఎ. సోనీబాల దేవి గారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.