Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణజాతీయ స్థాయి కబడ్డీలో హజారి గూడెం గ్రామానికి చెందిన భాను ప్రకాష్‌కు ఘన సత్కారం!

జాతీయ స్థాయి కబడ్డీలో హజారి గూడెం గ్రామానికి చెందిన భాను ప్రకాష్‌కు ఘన సత్కారం!

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమం న్యూస్
జాతీయ స్థాయి కబడ్డీలో హజారి గూడెం గ్రామానికి చెందిన భాను ప్రకాష్‌కు ఘన సత్కారం!chool Games Federation of India (SGFI) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి Under-17 Boys కబడ్డీ పోటీల్లో 2025 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించిన భాను ప్రకాష్‌ను ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాల మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా కలెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు, నల్గొండ మేయర్ శ్రీ బుర్రి విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి గారు భాను ప్రకాష్‌ను అభినందించి, అవార్డుతో సత్కరించారు.అలాగే నల్గొండ జిల్లా DYSO శ్రీ అక్షయ్ అలీ గారు కూడా భాను ప్రకాష్‌ను ప్రత్యేకంగా అభినందించి, జాతీయ స్థాయిలో సాధించిన విజయాన్ని ప్రశంసించారు. భాను ప్రకాష్‌ను జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ శ్రీ ఆవుల చంద్రశేఖర్ గారిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.భాను ప్రకాష్ సాధించిన ఈ విజయం నల్గొండ జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం.ఇలాంటి ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.భాను ప్రకాష్‌కు హజారి గూడెం గ్రామ పంచాయితీ తరపున గ్రామ ప్రజలు, యువకులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.