* జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
* సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు
* హాజరైన జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది
ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ:
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, జిల్లా సమగ్ర ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲 తాజా వార్తల కోసం వాట్సాప్ గ్రూప్‌లో చేరండి:
https://chat.whatsapp.com/BwFy3XDxdrO6uJ7tQ3nS3l?s=cl&p=a&mlu=4

