నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు!
27 సార్లు పొడిచి ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసిన టెన్త్ క్లాస్ విద్యార్థులు!
ఎట్టకేలకు కనిపెట్టి అరెస్ట్ చేసిన పోలీసులు!
ప్రజా సంక్షేమం న్యూస్
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి బేబీ కాలనీకి చెందిన నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కే రూపా రెడ్డి ఈనెల11న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ దారుణ హత్యకు పాల్పడింది ఆ స్కూల్ లో పదో తరగతి (15) చదువుతున్న విద్యార్థి గా గుర్తించిన పోలీసులు. మండల పరిధిలోని పూల్ సింగ్ తండాకు చెందిన విద్యార్థి ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది. హత్యకు ముందు మాస్క్ బ్లౌజులు, హుడి కొనుగోలు చేసి సీసీ కెమెరాలు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు.గంజాయికి అలవాటు పడి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి, డబ్బుల కోసం హత్య చేసినట్లు నిర్ధారణ.ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో ఇద్దరు 10th క్లాస్ విద్యార్థులు అరెస్ట్.ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య.ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి చొరబడ్డ నిందితులు.ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్న నిందితులు.ఆమె ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనకాల నుంచి వచ్చి కత్తితో 27 సార్లు పొడిచి దాడిఆ తర్వాత ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న రూ.2 లక్షల రూపాయల డబ్బును ఎత్తుకెళ్లిన విద్యార్థులు.ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు, ఎవరికీ డౌట్ రాకుండా సీసీ కెమెరాల్లో పడకుండా జాగ్రత్తలు…

