Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తా! ముఖ్యమంత్రి శ్రీ ఎ....

రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తా! ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజా సంక్షేమ న్యూస్-హైదరాబాద్
ట్యాంక్‌బండ్‌ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ,“గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను అని గుర్తుచేశారు.గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నాం” అని చెప్పారు
గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూచించారు.
“దొరలు,భూస్వాములు,పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు,ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది” అని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
“గీత కార్మికులు, గౌడన్నలు ఎంతో కాలంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యంలో నేనే స్వయంగా నెక్లెస్ రోడ్ చౌరస్తాకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి జ్యోతిరావు పూలే దంపతులకు విగ్రహం ఉండాలని స్థలాన్ని ఎంపిక చేశాను.
అలాగే, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరోచోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం” అని వివరించారు.“సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి కాదు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి.ఇది బహుజనుల తెలంగాణ.సామాజిక న్యాయం,జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో,తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు. బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది” అని గుర్తుచేశారు.కులవృత్తిని కొనసాగించండి. గౌరవించండి.కానీ పిల్లలను మాత్రం చదివించండి.పిల్లల తలరాతలను మార్చే శక్తి మన చేతుల్లో ఉంది. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలి” అని పిలుపునిచ్చారు.“విద్యార్థుల కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తాం. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తాం.గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదు. మా ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం.పాలు,రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం.మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి.వాళ్లను చదివించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది.ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు 2 వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పనిచేస్తుంది.సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం.ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం” ముఖ్యమంత్రి గారు చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.