
డాక్యుమెంటరీ పోస్టర్‌ను విడుదల చేసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు!
ప్రజా సంక్షేమం న్యూస్
ప్రజా ఉద్యమాలకు చిరునామా గద్దర్ అని, పీడిత ప్రజల గొంతుకగా తన ఆట, పాటలతో కోట్లాది మందిని ఉద్యమం వైపు నడిపించిన మహనీయుడని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు కొనియాడారు.
గద్దర్ అన్న అంటే తనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానమని, ఆయన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డులను అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
గద్దర్ జీవితంలోని ఉద్యమ ప్రస్థానం, ఆయన పోరాట స్ఫూర్తి, భావితరాలకు తెలియని ఎన్నో అంశాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. గద్దర్ కుమార్తె వెన్నెల చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.గద్దర్ ఆశయాలను, ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం అందరి బాధ్యత అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు పేర్కొన్నారు.

