Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణమర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుక.

మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుక.

📰 Generate e-Paper Clip


ప్రజా సంక్షేమం న్యూస్.
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు..
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి సతీమణి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి మేడం గారి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కోమటిరెడ్డి లక్ష్మి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ప్రజాసేవలో మరిన్ని విజయాలు కలగాలని నాయకులు ఆకాంక్షించారు…
ఈ కార్యక్రమం ద్వారా జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని పలువురు నాయకులు సూచనలు చేశారు.కార్యక్రమంలో
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి, సర్పంచులు, ఉప సర్పంచ్లు మాజీ సర్పంచ్లు,మాజీ ఎంపీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్లు మాల్ మార్కెట్ డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.