Saturday, August 22, 2026
prajasamkshemam news
Homeతెలంగాణలో-వోల్టేజ్-కరెంటు కోతలు-రైతుల కరెంటు కష్టాలపై విద్యుత్ SE కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ శ్రేణులు:

లో-వోల్టేజ్-కరెంటు కోతలు-రైతుల కరెంటు కష్టాలపై విద్యుత్ SE కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ శ్రేణులు:

📰 Generate e-Paper Clip

రైతులకు కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ పాలన ఎందుకు?
రైతుల కరెంటు కష్టాలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమరశంఖం!
విద్యుత్ SE కార్యాలయం ముట్టడించిన బీఆర్‌ఎస్ శ్రేణులు…
లో-వోల్టేజ్‌తో మోటర్లు కాలిపోతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది?

ప్రజా సంక్షేమం న్యూస్:
కరెంటు కోతలతో పంటలు ఎండిపోతుంటే రైతుల గోడు స్థానిక జిల్లా మంత్రులకు,ప్రభుత్వానికి వినిపించడంలేదా!అని నకిరేకల్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరువర్తి లింగయ్య రైతులతో విద్యుత్ SE కార్యాలయం ముట్టడించి వినూత్న నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 గంటల నాణ్యమైన విద్యుత్ హామీ ఏమైంది? మోటర్లు కాలిపోతున్నాయి,వరి ఎండిపోతోంది,కాంగ్రెస్ పాలనలో రైతన్న పరిస్థితి దయనీయం!పవర్‌ లేని సమస్య కాదు!పాలనలోనే పవర్ లేదు!
లో-వోల్టేజ్‌తో దెబ్బతిన్న మోటర్లకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి,రైతుల కన్నీళ్లకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అంటూ చిరుమర్తి ఫైర్అయినాడు.రైతుల సమస్యలు పట్టించుకోకపోతే.ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరికచేసాడు కాలిపోయిన బోరు మోటర్లు,ఎండిపోయిన వరిని చేతబట్టి రైతులతో కలిసి చిరుమర్తి లింగయ్య వినూత్న నిరసన చేసాడు.“రైతులకు కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు?” అంటూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.లో-వోల్టేజ్, కరెంటు కోతలతో రైతులు నష్టపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు…రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.