Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedవాయుసేన ఉద్యోగులు అనుమతి లేకుండా రాజీనామా చేయలేరు: సుప్రీంకోర్టు

వాయుసేన ఉద్యోగులు అనుమతి లేకుండా రాజీనామా చేయలేరు: సుప్రీంకోర్టు

📰 Generate e-Paper Clip

భారత వాయుసేనలో పనిచేసే ఉద్యోగులు ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగం మానేసి ఇతర సివిల్ పోస్టుల్లోకి చేరడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏడేళ్లపాటు వాయుసేనలో కార్పోరల్గా పనిచేసిన నఖత్సంగ్, ఎయిర్ఫోర్స్ నుంచి అనుమతి తీసుకోకుండా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాలనుకోవడం చెల్లదని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. దేశభద్రత దృష్ట్యా వాయుసేన ఉద్యోగులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వేరే ఉద్యోగంలో చేరాలనుకుంటే తొలి దశలోనే అనుమతి పొందాలని కోర్టు పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.