ఆదివారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి సుమారు 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరే అవకాశం.రోజుకు సుమారు 17 టీఎంసీల మేర నీరు జలాశయంలోకి చేరనున్నట్లు అంచనా.పశ్చిమ కనుమల్లో భారీ వర్షాల కారణంగా కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద ప్రవాహం పెరుగుతోంది.ప్రస్తుతం ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి 1.10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నారాయణపూర్ (నారాయణ సాగర్) ప్రాజెక్టు నుంచి కూడా దాదాపు అదే స్థాయిలో నీటి విడుదల కొనసాగుతోంది.మహారాష్ట్రలోని భీమా (ఉజ్జయిని) ప్రాజెక్టు నుంచి 90 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.భీమా ఉపనది నిరాపై ఉన్న వీర్ రిజర్వాయర్ నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.భీమా, వీర్ నుంచి విడుదలైన వరద జూరాల ఎగువన రాయచూర్ సమీపంలోని నివృతి సంగమం వద్ద కృష్ణానదిలో కలవనుంది.భీమా పరివాహక ప్రాంతం నుంచి వచ్చే వరద కృష్ణానదికి చేరడానికి సుమారు 4 నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉంది.
మహాబలేశ్వర్, నవజా ఘాట్ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల సూచనలతో ఆల్మట్టి ఇన్‌ఫ్లో 2 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని జలవనరుల వర్గాలు అంచనా వేస్తున్నాయి.దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగే అవకాశాలపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.
శ్రీశైలానికి భారీ వరద సూచన
RELATED ARTICLES

