ప్రజా సంక్షేమం న్యూస్:
నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ప్రజాభిప్రాయం మేరకు గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. కానీ ఒక్క ఉద్యోగిని కూడా నియమించలేదు. దీంతో ఆఫీసుకు తాళం వేలాడుతోంది, పరిపాలన పూర్తిగా స్తంభించింది.గత ఆరేండ్ల క్రితం హలియా మున్సిపాలిటీలో విలీనమైన ఇబ్రహీంపేటను తిరిగి గ్రామ పంచాయతీగా మార్చారు. పంచాయతీగా మారి దాదాపు ఏడాది అవుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ గ్రామం ప్రాథమిక సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు.
ఖాళీగా ఉన్న పోస్టులు:
ఎలక్ట్రిసిటీ లైన్మెన్, పారిశుద్ధ్య కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది పోస్టులు గత 8 నెలల నుంచి ఏడాది వరకు అవుతున్న ఒక్కరిని కూడా నియమించలేదు ఖాళీగా ఉన్నాయి.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు:
1. విద్యుత్ కోతలు: లైన్మెన్ లేకపోవడంతో కరెంట్ సమస్యలు పరిష్కారం కావడం లేదు.
2. పారిశుద్ధ్యం: కార్మికులు లేక వీధులు, డ్రైనేజీలు శుభ్రం కావడం లేదు. జ్వరాలు పెరుగుతున్నాయి.
3. సేవలు నిలిచిపోయాయి: పెన్షన్లు, సర్టిఫికెట్లు, పట్టాదారు పాస్ బుక్ ల కోసం ప్రజలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

