ప్రజా సంక్షేమం న్యూస్-నల్లగొండ
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు,సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలిచిన మహావీరుడు.సామాన్య ప్రజలపై జరుగుతున్న అణచివేతను ఎదిరించి,బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారు.సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి తనదైన పోరాట పంథాను కొనసాగించారు.పాపన్నగౌడ్ జీవితం ధైర్యం,ఆత్మగౌరవం,సమానత్వం,ప్రజలకోసం పోరాటం వంటి విలువలకు స్ఫూర్తినిస్తుంది.ఆయన ఆశయాలను నేటి తరానికి పరిచయం చేయడం,ఆయన పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజ సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గారు తెలియజేశారు.సర్దార్ సర్వాయి పాపన్న 376 వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఖాతాలగూడెం లో ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలం వెంకట మధు, బీసీ సంఘం నాయకులు ఉల్లెందుల అంజయ్య,జెనిగా లింగస్వామి యాదవ్, భీమనపల్లి శంకరయ్య, ఎల్లుట్ల రవి , గడ్డం మారయ్య, పగిలి ఎంకన్న, గుడిపూడి నరేందర్ గౌడ్ తదితరులు ఫాల్గున్నారు.

