Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలి:సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి

అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలి:సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయాలి…
ప్రజాసంక్షేమం న్యూస్ -నల్గొండ

హక్కుల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులను ముందస్తు అరెస్టుల పేరుతో అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధించడాన్ని ప్రజలు ప్రజాతంత్ర వాదులు ఖండించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం లు పిలుపునిచ్చారు.బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు అక్రమ అరెస్టులను ఖండిస్తూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరుతూ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు సామూహిక నిరసన దీక్షలు చేయడం జరిగింది ముఖ్యఅతిథిగా హాజరై దీక్షలను ప్రారంభించిన వీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కార్మికుల పోరాట టెంట్ల వద్దకు వచ్చి మీ యొక్క డిమాండ్స్ కనీసం వేతనం 26,000 ఫిక్స్డ్ వేతనం 18000 వృత్తి రక్షణ ఉద్యోగ బీమా వెల్ఫేర్ బోర్డు మల్టీపర్పస్ విధానం రద్దు ఈ డిమాండ్స్ అన్ని న్యాయమైనవి మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని ప్రజల ముందు నిండు బహిరంగ సభల్లో వాగ్దానం చేశారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు .వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన సంబర సంబరాలు చేసుకుంటున్నరే తప్ప కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి అన్నారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మూడు సంవత్సరాల కాలంలో అనేక దఫాలుగా కింది స్థాయి నుండి కమిషనర్ వరకు అనేకమార్లు మెమోరాండలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాని సందర్భంలో వారి యొక్క నిరసనను తెలియజేయడానికి ఈనెల 8 9 తారీకులలో ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఇందిరాపార్కు దగ్గర నిరసనకు బయలు దేరుతుంటే అర్ద రాత్రి ఉగ్రవాదుల పై దాడి చేసినట్టుగా కార్మికుల ఇండ్లలోకి జొరబడి మహిళలు అనే మానవత్వాన్ని మర్చిపోయి అడ్రస్సు తెలవకుండా నిర్బంధించారు. ఈ విధానం సరి కాదని ఇకనైనా డిమాండ్లు నెరవేర్చకపోతే పోలీసు నిర్బంధాన్ని నిరంకుశత్వాన్ని మానుకోకపోతే రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలు ఉదృతం అవుతాయి దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ మధ్యకాలంలో ఈ రంగాల ధర్నాలు ఉన్న పోలీసులు కార్మికుల ఇండ్లపై కార్మిక నాయకుల ఇండ్లపై దాడి చేసి ముందస్తు అరెస్టుల పేరుతో అక్రమ అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని అవి మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. నిరసన దీక్షల అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ బి శ్రీనివాస్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, లకపాక రాజు, దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, ఏర్పుల యాదయ్య అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొడిశెట్టి నాగమణి, బి పార్వతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వరి, తవిటి వెంకటమ్మ, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్న అంజయ్య, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ, మణెమ్మ వజ్రమ్మ పార్వతమ్మ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మారం దయానంద్ అద్దంకి నరసింహ , సల్వోజు సైదాచారి,సుంకర బోయిన వెంకన్న ,పందుల లింగయ్య గంజి రాజేష్,చెరుకు జానకి అనురాధ నెలగొంద రాసి లింగయ్య ఏ మారయ్య,సల్ల యాదయ్య పజ్జురి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు
ఎండి సలీం
సిఐటియు జిల్లా కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.