విషాదంలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్న రెండు కుటుంబాలు
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: బ్రెయిన్ డెడ్ అయిన కామారెడ్డి జిల్లాకు చెందిన టెక్కీ కుడిక్యాల వినయ్ (26), యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పద్మ ఆండాలు (60) అవయవదానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మను ప్రసాదించారు.తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయం.తమ ఆత్మీయులను కోల్పోయిన బాధలోనూ,మరికొందరి ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయం మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది.
వారి అవయవ దానంతో ఆపదలో ఉన్న పలువురికి కొత్త జీవితం లభించే అవకాశం ఏర్పడింది.తమ ఆత్మీయులు ఇక లేరనే విషాదాన్ని అధిగమించి,మరికొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చిన ఈ రెండు కుటుంబాల నిర్ణయానికి పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.మరణం తర్వాత కూడా మరొకరి రూపంలో జీవించే అవకాశం కల్పించేది అవయవదానం.చీకటిలో ఉన్న కుటుంబాల్లో మళ్లీ ఆశాకిరణాలు నింపే మహత్తర మానవతా కార్యం ఇది.అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.
అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ:
RELATED ARTICLES

