Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఎంఐఎంకు భారీ షాక్.. టీఆర్పీలో భారీ చేరికలు!

ఎంఐఎంకు భారీ షాక్.. టీఆర్పీలో భారీ చేరికలు!

📰 Generate e-Paper Clip

అక్బరుద్దీన్ ఓవైసీ ఇలాకా నుంచి అమీర్ ఖాన్‌తో పాటు 80 మంది టీఆర్పీలో చేరిక:
ప్రజా సంక్షేమం న్యూస్ – హైదరాబాద్
:
ఎంఐఎం పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) నేతలు తెలిపారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అనుచరుడిగా గుర్తింపు పొందిన అమీర్ ఖాన్ తన 80 మంది అనుచరులతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.టీఆర్పీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు సల్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అమీర్ ఖాన్‌తో పాటు ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
అమీర్ ఖాన్‌కు కీలక బాధ్యత:
ఈ సందర్భంగా అమీర్ ఖాన్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మైనారిటీ యూత్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ తీన్మార్ మల్లన్న నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మైనారిటీ యువతను టీఆర్పీ సిద్ధాంతాల వైపు తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.
మైనారిటీలకు సమాన వాటానే లక్ష్యం: తీన్మార్ మల్లన్న
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో మైనారిటీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన వాటా కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మైనారిటీల అభివృద్ధి, సాధికారత కోసం టీఆర్పీ నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా మైనారిటీల ఆశయాలను నెరవేర్చడంలో ఎంఐఎం పార్టీ విఫలమైందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. అందుకే యువత ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా టీఆర్పీ వైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు.
రానున్న రోజుల్లో మైనారిటీ వర్గాలకు చెందిన మరింత మంది యువత, నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరనున్నారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
నాయకుల హాజరు:
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంగాధర్ లింగాల, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, కార్మిక విభాగం అధ్యక్షుడు సంకూరి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యదర్శి కొమ్మల ప్రవీణ్ రాజ్, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింటూ, ప్రధాన కార్యదర్శి వీరమల్లు అనిల్, సహాయ కార్యదర్శి గిరిగాను బిక్షపతి గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు మున్నూరు జయపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండి గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.