Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణజర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా!

జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా!

📰 Generate e-Paper Clip

TUWJ–IJU రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్. నేత
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (TUWJ–IJU) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్య పరిష్కారం కోసం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పున్న కైలాష్ నేత మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో,ప్రజాప్రతినిధులతో చర్చించి కృషి చేస్తామని పున్న కైలాష్ నేత పేర్కొన్నారు.
— ప్రజాసంక్షేమం న్యూస్ | PS NEWS

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.