Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణడ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు..!

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు..!

📰 Generate e-Paper Clip

ఈగల్ ఫోర్స్‌ ప్రతిభకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసలు
2029 డిసెంబర్‌ నాటికి డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యం
యువతను కాపాడటం ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత:సీఎం
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ఈగల్ ఫోర్స్‌ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ విక్రయం, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ఈ జాతీయ గుర్తింపు నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) 3వ జాతీయ సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అత్యుత్తమ అవార్డు అందుకోవడం తెలంగాణ పోలీసు శాఖకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
డ్రగ్స్‌పై పోరాటం అందరి బాధ్యత:
మాదకద్రవ్యాల మహమ్మారిని అరికట్టడం కేవలం పోలీసు వ్యవస్థ బాధ్యత కాదని సీఎం స్పష్టం చేశారు. యువత డ్రగ్స్‌ బారిన పడకుండా కాపాడటం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని అన్నారు.యువతే రాష్ట్రానికి, దేశానికి భవిష్యత్తు అని పేర్కొంటూ.. వారిని మాదకద్రవ్యాల ప్రభావం నుంచి రక్షించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్‌ సమాచారాన్ని అధికారులకు అందించాలి:
సమాజంలో ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయం, అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సీఎం కోరారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు యువతలో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని సూచించారు.
2029 నాటికి డ్రగ్స్‌ రహిత తెలంగాణ:
‘నషా ముక్త్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడాలని సీఎం ఆకాంక్షించారు. 2029 డిసెంబర్ నాటికి డ్రగ్స్‌ రహిత తెలంగాణ నిర్మాణం దిశగా ఈగల్ ఫోర్స్‌ మరింత దృఢ సంకల్పంతో పనిచేయాలని అన్నారు.మాదకద్రవ్యాలపై పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తూ.. యువతను చైతన్యపరచడం, డ్రగ్స్‌ అక్రమ రవాణా మరియు విక్రయాలపై ఉక్కుపాదం మోపడం, వినియోగాన్ని అరికట్టడం ద్వారా సురక్షితమైన, ఆరోగ్యకరమైన డ్రగ్స్‌ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.