Monday, October 12, 2026
prajasamkshemam news
Homeక్రైమ్నల్లగొండలో దారుణ హత్య..

నల్లగొండలో దారుణ హత్య..

📰 Generate e-Paper Clip

మీర్బాగ్ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో కలకలం
కూలీ డబ్బుల విషయంలో ఘర్షణే కారణమా?
ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ.. క్లూస్ టీమ్‌లతో దర్యాప్తు
నల్లగొండ,సెప్టెంబర్ 27 | ప్రజాసంక్షేమం న్యూస్
:నల్లగొండ పట్టణంలోని మీర్బాగ్ కాలనీ రోడ్ నంబర్-6లో దారుణ హత్య ఘటన కలకలం రేపింది.షా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు 402వ గదిలో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం.ప్రాథమిక సమాచారం ప్రకారం..తమిళనాడుకు చెందిన కూలీల మధ్య కూలీ డబ్బుల విషయంలో మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఒక వ్యక్తిని జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం.
నల్లగొండలో నూతనంగా నిర్మిస్తున్న చెన్నై షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం తమిళనాడు,చెన్నై నుంచి కూలీలు వచ్చినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న డీఎస్పీ కె.శివరామరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై సైదాబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్‌లతో పోలీసులు ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.
హత్యకు గల అసలు కారణం, మృతుడి పూర్తి వివరాలు, ఘటనలో ఎవరి ప్రమేయం ఉందనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.