Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణప్రభుత్వ ఆసుపత్రులలో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరిస్తున్నాం:వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ ఆసుపత్రులలో అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరిస్తున్నాం:వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

📰 Generate e-Paper Clip

అత్యాధునిక వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నాం.
రాజీవ్ ఆరోగ్య శ్రీ లో ఉచితంగా 90 శాతం సర్జరీ లను అందిస్తున్నాం.
ప్రజాసంక్షేమం న్యూస్

స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్ ప్రారంభోత్సవం లో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ గారు సనత్ నగర్ లోని డా.మర్రి చెన్నారెడ్డి TIMS ఆసుపత్రిలో స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్ షాప్ ను ప్రారంభించారు.ఈ వర్క్ షాప్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించిన మెడికల్ రోబోటిక్ ఎక్విప్మెంట్,ఇన్ఫ్రాస్ట్రక్చర్ లను పరిశీలించారు.వాటి వినియోగం పై నిపుణులతో చర్చించారు.వైద్య రంగంలో రోబోటిక్ సర్జరీ సేవలపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు వర్క్ షాప్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.వర్క్ షాప్ లో పాల్గొన్న అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ నిపుణులను ఉద్దేశించి మాట్లాడారు.రాష్ట్రం లో వైద్య సేవల బలోపేతం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.ఫార్మా హబ్ గా తెలంగాణ రాష్ట్రం లో వైద్య ఆరోగ్య సేవల రంగంలో బ్రాండ్ గా విస్తరించేందుకు నూతనంగా TIMS,ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామన్నారు.వైద్య రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను అందిపుచ్చుకునేందుకు మెడికల్ కాలేజీ లను బలోపేతం చేస్తున్నామన్నారు.నాణ్యమైన వైద్య విద్య అందించేందుకు డాక్టర్స్,నర్సింగ్ సిబ్బంది,నిపుణులను తయారు చేయటానికి ఆధునిక స్కిల్స్ తో శిక్షణ ఇస్తున్నామన్నారు.మెడికల్ కాలేజీలు,GGH ఆసుపత్రుల లో వచ్చే 6 నెలల్లో అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తేచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టిందన్నారు.
దేశం లో రోబోటిక్ సర్జరీ పితామహుడు డా సుధీర్ శ్రీవాత్సవ గారి సేవలను తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగించుకుంటున్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రోబోటిక్ సర్జరీ సేవలలో ముందడుగు వేశామన్నారు.NIMS ఆసుపత్రిలో అనతి కాలంలోనే 1000 రోబోటిక్ సర్జరీ లను నిర్వహించిన ఘనత సాధించిందన్నారు.రాష్ట్రంలో రోబోటిక్ సర్జరీ సేవలను వచ్చే ఆరు నెలల్లో వేగంగా విస్తరిస్తామన్నారు.రాష్ట్రంలో ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్,టీమ్స్ ఆస్పత్రులలో,నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి,నీలోఫర్,వరంగల్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లతో పాటు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న జి జి హెచ్ లలో అడ్వాన్సుడ్ రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న టీమ్స్,ఉస్మానియా హాస్పిటల్ ల నిర్మాణం పూర్తవుతే 40 వేల పైన బెడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు.మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టీమ్స్ ఆస్పత్రిలో 100 బెడ్ల ను ఇంటర్నేషనల్ పేషంట్ల కోసం అందుబాటులో ఉంచామన్నారు.రాష్ట్రంలో క్యాన్సర్ కేర్, ట్రామా కేర్ పాలసీ లను అమలు చేస్తున్నామన్నారు.రాష్ట్రం లో 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ సర్వీస్ హబ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దు తున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో DME డా.వాణి,టీమ్స్ డైరెక్టర్ డా.నరేంద్ర కుమార్,డా.బీరప్ప,డా.విమల థామస్, డా. సుధీర్ శ్రీవాత్సవ,డా.రాజ్ గజ్భియే లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.