హయత్నగర్లో సైదులు నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా!
ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల,సెప్టెంబర్ 23:చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఉయ్యాల లింగయ్య సోదరుడు ఉయ్యాల సైదులును విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాల సైదులు కాలికి గాయమై, ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుత్తా అమిత్ రెడ్డి బుధవారం హయత్నగర్లోని సైదులు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా సైదులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. సైదులు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని గుత్తా అమిత్ రెడ్డి ఆకాంక్షించారు.

