33 జిల్లాల కళాకారులు భారీగా తరలిరావాలి
కళాకారులకు ఉద్యోగాల కోసం పోరాటం ఉధృతం
వంటావార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
మునుగోడు, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి):
సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘హలో కళాకారుడా.. చలో రవీంద్ర భారతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న గద్దర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని, కుటుంబాలను సైతం వదిలి నెలల తరబడి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు ప్రస్తుతం బతుకుదెరువు లేకుండా పోయిందని ఆయన అన్నారు. ఆటలు, పాటల ద్వారా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించినప్పటికీ, మిగిలిన కళాకారుల సమస్యలు పరిష్కారం కాలేదని వనం లింగన్న అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 1,000 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు.కళాకారులకు ఉద్యోగాలు కల్పించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న తెలంగాణలోని 33 జిల్లాల నుంచి కళాకారులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి రవీంద్ర భారతి ముట్టడి, వంటావార్పు కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రధం నర్సింగ్ రావు, కార్యదర్శి రాములు, సైదులు తదితర కళాకారులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 30న ‘చలో రవీంద్ర భారతి’ ముట్టడిని జయప్రదం చేయండి
RELATED ARTICLES

