Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసోషల్ మీడియా నేటి రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధం.శ్రీ బీర్ల అయిలయ్య

సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధం.శ్రీ బీర్ల అయిలయ్య

📰 Generate e-Paper Clip

బీఆర్‌ఎస్,బీజేపీ తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలి:ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య
ప్రజాసంక్షేమం న్యూస్-యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశం యాదగిరిగుట్టలోని మున్నూరు కాపు సత్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా అత్యంత కీలకమైన,శక్తివంతమైన వేదికగా మారిందన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలను చేరవేయడంతో పాటు,బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా సోషల్ మీడియా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
మహాలక్ష్మి,గృహజ్యోతి,చేయూత,రైతు భరోసా,ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రజా సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైనవని, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను విస్తృతంగా వివరించాలని అన్నారు.తెలంగాణను పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేసి,ప్రస్తుతం కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బూత్ స్థాయి నుంచి సోషల్ మీడియా వేదికగా సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.ఆలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సోషల్ మీడియా బృందాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.