నార్కెట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన పలువురు నాయకులు హస్తం గూటికి
ప్రజాసంక్షేమం న్యూస్ – నార్కెట్‌పల్లి:
నార్కెట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలకూరి నరేష్, గట్టిగుండ్ల లింగస్వామి, దాసరి ఉదయ్, గడ్డం శ్రీకాంత్, ఓరుగంటి శివ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం సమక్షంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. పార్టీలో చేరిన నాయకులకు ఎమ్మెల్యే వేముల వీరేశం సాదరంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హస్తం గూటికి బీఆర్‌ఎస్ నేతలు.. వేముల వీరేశం సమక్షంలో చేరికలు
RELATED ARTICLES

