ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు 2,250 మంది హాజరు.. 500 మంది అభ్యర్థుల ఎంపిక
ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ:పోలీస్ శాఖలో ఎస్‌ఐ,కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది.ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 2,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు.ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన 500 మంది అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రత్యేక శిక్షణ అందించనున్నారు.శిక్షణలో భాగంగా సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక బోధన, మోడల్ టెస్టులు,అభ్యర్థుల సందేహాల నివృత్తితో పాటు పోలీస్ ఉద్యోగాలకు అవసరమైన శారీరక దారుఢ్యంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ..పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని,సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశమని పేర్కొన్నారు.ఎంపికైన అభ్యర్థులు క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ,పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
— ప్రజాసంక్షేమం న్యూస్
ఎస్‌ఐ,కానిస్టేబుల్ ఉచిత శిక్షణకు భారీ స్పందన!జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
RELATED ARTICLES

