Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణహైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి: ముఖ్యమంత్రి

హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి: ముఖ్యమంత్రి

📰 Generate e-Paper Clip

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి,అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ,పర్యాటక అభివృద్ధి, ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీపై అధికారులతో సమీక్ష!
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:

వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేసే దిశగా పలు కీలక అంశాలపై నిన్న రాత్రి అధికారులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి,అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ,టెంపుల్ మరియు ఫారెస్ట్ టూరిజం అభివృద్ధి,వరంగల్ ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీ,బస్ టెర్మినల్,ఔటర్ రింగ్ రోడ్డు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. ఆసుపత్రి నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు.వరంగల్ నగరానికి మెరుగైన మౌలిక వసతులు, వైద్య సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, పర్యాటక అభివృద్ధి కల్పిస్తూ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.