Thursday, October 15, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఆపదలో ఉన్న కుటుంబానికి అండగా రూ.20 వేల ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా రూ.20 వేల ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

**ఉరుమడ్ల, అక్టోబర్ 15 (ప్రజా సంక్షేమం న్యూస్):** ఉరుమడ్ల గ్రామానికి చెందిన దివంగత జన్నపాల లింగస్వామి కుటుంబానికి ఉరుమడ్ల లారీ అసోసియేషన్, బోరింగ్ డ్రిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అని, కష్టకాలంలో అండగా నిలవడం మానవత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాగర్ల గంగరాజు, చెరుకు సైదులు, జన్నపాల మురళి, రూపని శ్రీశైలం, రూపని వెంకన్న, కంబాలపల్లి లింగస్వామి, జన్నపాల రాజు, జన్నపాల స్వామి, జన్నపాల చరణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.