Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: సీపీఎం

ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: సీపీఎం

📰 Generate e-Paper Clip

ఢిల్లీకి వెళ్తున్న నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఆత్మకూరులో నిరసన
ప్రజాసంక్షేమం న్యూస్ ఆత్మకూరు, అక్టోబర్ 11:
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు వెళ్తున్న సీపీఎం నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఆదివారం ఆత్మకూరు పట్టణంలో శివాజీ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వేముల భిక్షం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల హక్కులకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, సామాన్యుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపే ప్రజాసంఘాల నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం సీనియర్‌ నాయకుడు రచ్చ గోవర్ధన్‌, మండల కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణరెడ్డి, కందడి వెంకటరెడ్డి, వీరస్వామి, యాదయ్య, బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.